Monday, December 23, 2024

వాయు కాలుష్యంపై అధ్యయనానికి ‘టెంపో’ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

ట్రాఫిక్ రద్దీ సమయాల నుంచి అడవుల కార్చిచ్చు, అగ్నిపర్వతాల విస్ఫోటనాల వరకు వెలువడే కాలుష్యం స్థాయిలను గ్రహించి వాటిని అధ్యయనం చేయడానికి వీలయ్యే ప్రత్యేక ఫీచర్లు ఉన్న టెంపో పరికరాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రోదసీలోకి పంపించింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన సాల్మన్ రాకెట్ ద్వారా టెంపోను కక్షంలోకి శుక్రవారం రాత్రి ప్రయోగించారు. వాషింగ్ మెషిన్ అంత సైజులో ఉండే ఈ టెంపో పరికరం అంతరింలో రసాయన ప్రయోగశాలగా అభివర్ణిస్తున్నారు. జియో స్టేషనరీ ఆర్బిట్‌లో ఇంటెల్‌సాట్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ ఆధారంగా ఉంటుంది.

భూమి దిగువ కక్షలో కాలుష్య నిర్వాహక శాటిలైట్లు ఉండడం అంటే రోజుకోసారి నిర్ణీత సమయంలో అధ్యయనం చేస్తాయి. కానీ టెంపో వాతావరణ కాలుష్యాన్ని గ్రహించగలుగుతుంది. టెంపోతో అట్లాంటిక్ తీర ప్రాంతాలతోపాటు అమెరికా, మెక్సికో, కెనడా ప్రాంతాల్లోని వాయు కాలుష్య విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తారు. ఉత్తర అమెరికాలో ఉన్న వాయు నాణ్యత గురించి గంటగంటకు టెంపో సమాచారం అందిస్తుందని నాసా తన ట్విటర్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News