Friday, December 20, 2024

2024లో మహారాష్ట్ర అంతా ఎగిరేది కాషాయి జెండాయే : ఏక్‌నాథ్ షిండే

- Advertisement -
- Advertisement -

అయోధ్య (యూపి): తమపార్టీ , బీజేపీ భావజాలం ఒకటే అయినందున వచ్చే ఏడాది ఎన్నికల్లో మహారాష్ట్ర అంతా కాషాయ జెండాయే ఎగురుతుందని శివసేన నాయకుడు, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. ఆదివారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ పాత్ర చాలా స్పష్టంగా ఉందని, బీజేపీతో శివసేన మిత్రపక్షంగా పొత్తుతో ఉంటుందని, తమ రెండు పార్టీల భావజాలం ఒక్కటేనని, అదే హిందుత్వమని ఆయన పేర్కొన్నారు.

అయోధ్య నుంచి కొత్తశక్తితో తమ రాష్ట్రానికి తాము వెళ్లి ప్రజలకు సేవ చేస్తామన్నారు. హిందుత్వ అంటే కొందరికి అలర్జీ అని , దేశంలో ప్రతి ఇంటిని హిందుత్వ చేరితే వారి ‘దుకాణం’ మూతబడినట్టేనని ఎవరిపేరు ఉద్దేశించకుండా వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత షిండే అయోధ్యలో పర్యటించడం ఇదే తొలిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News