Tuesday, December 24, 2024

రేపు విచారణకు హాజరు కానున్న ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నోటీసులందుకున్న బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డిసిపి కార్యాలయంలో విచారణకు హాజరవ్వనున్నారు. గురు వారం హుజూరాబాద్ ఎంఎల్‌ఎ ఈటలకు వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డిసిపి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈటలకు ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు.

శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి నేరుగా వెళ్లి నోటీసులు అందజేశారు. నోటీసులపై స్పందించిన ఈటల రాజేందర్ వరంగల్ డిసిపికి లేఖ రాశారు. ఎస్ ఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఈనెల 10వ తేదీన వస్తానని చెప్పా రు. నేరుగా హన్మకొండ డీసీపీ కార్యాలయంలో 11 గంటల వరకు హాజరవుతానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News