Monday, December 23, 2024

మంత్రాలయంలో భర్తను రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపించి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియురాలి భర్తకు ప్రియుడు మద్యం పూటుగా తాగించి రైలు పట్టాలపై పడుకోబెట్టి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….మాధవరంలో గ్రామంలో ఉప్పర నారాయణ, వరలక్ష్మీ అనే దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మారం దొడ్డి గ్రామంలో చిన్న గోవిందుతో వరలక్ష్మీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనుమానంతో నారాయణ తన భార్యను మానసికంగా వేధించడంతో పాటు పలుమార్లు దాడి చేశాడు. దీంతో భర్తను చంపేయాలని ప్రియుడికి చెప్పింది. ప్లాన్‌లో భాగంగా నారాయణతో కలిసి గోవిందు మద్యం తాగాడు.

అనంతరం నారాయణకు ఫుల్‌గా మద్యం తాగించడంతో స్పృహ పడిపోయాడు. వెంటనే అతడిని తీసుకెళ్లి రైలు పట్టాలపై పడుకోబెట్టాడు. రైలు అతడిపై నుంచి పోవడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. అదే విషయాన్ని ఫోన్‌లో తన ప్రియురాలికి ప్రియుడు చెప్పాడు. తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి వరలక్ష్మి ఎవరెవరికి ఫోన్ చేసింది విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా వరలక్ష్మీ, గోవిందును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేయించానని వరలక్ష్మీ ఒప్పుకుంది. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News