అమరావతి: నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను 40 ఏళ్లు వెనక్కి నెట్టారని టిడిపి నేత అచ్చెన్నాయుడు తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ ప్రచార కార్యక్రమాకి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చింది. పారిపాలనలో ఘోరంగా విఫలమైన జగన్‌ను ఎలా నమ్మాలని చురకలంటించారు. సిఎం జగన్‌ను నమ్మితే ఎపి భవస్యత్ అంధకారమే అవుతుందని, జగన్‌ను ప్రజలు ఎందుకు నమ్మాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
టిడిపి నేత మూల్పూరి కల్యాణి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని టిడిపి నేత అచ్చెన్నాయుడు తెలిపారు. సిఎం జగన్ కుమార్ రెడ్డి దుర్మార్గాలను ప్రశ్నించినందుకే సాయి కల్యాణిపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. బెడ్‌రూమ్‌లోకి చొరబడి ఉగ్రవాదిలా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. జగన్ మెప్పు కోసం పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. ప్రశ్నించిన వారిని అణచి వేయాలని జగన్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.