Monday, December 23, 2024

నేడు ఈటెలను విచారించనున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: టెన్త్ పేపర్ లీక్ కేసులో కాసేపట్లో హన్మకొండలో డిసిపి కార్యాలయానికి బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ చేరుకున్నారు. సోమవారం ఈటెలను సెంట్రల్ జోన్ డిసిపి విచారించనున్నారు. నాలుగు రోజుల క్రితం ఈటెలకు కమలాపూర్ పోలీసులు నోటీసు జారీ చేశారు. ఈటెల ఇద్దర పిఎలు రాజు, నరేందర్‌లను పోలీసులు విచారించారు. ఇద్దరి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లీక్ కేసులో ప్రశాంత్ వైరల్ చేసిన నాలుగు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లకు నోటీసులు జారీ చేశారు. నిన్న ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు విచారించారు. జర్నలిస్టుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి సెల్‌ఫోన్లను పోలీసులు పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News