Monday, January 20, 2025

విశాఖ ఉక్కు బిడ్‌లో తెలంగాణ… జగన్‌కు ఆత్మహత్యే శరణ్యం: రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖ ఉక్కు బిడ్‌లో తెలంగాణ పాల్గొంటే సిఎం జగన్ మోహన్ రెడ్డికి ఆత్మహత్యే శరణ్యమని సిపిఐ నేత రామకృష్ణ ఎద్దేవా చేశారు. సిఎం జగన్ మోహన్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. బిడ్‌లో తెలంగాణ పాల్గొంటే…. మరి జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును జగన్ కాపాడకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని చురకలంటించారు. బిడ్‌లో తెలంగాణ పాల్గొంటే ఆంధ్రప్రదేశ్‌కే అవమాన్నారు. జగన్‌కు ధైర్యముంటే ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి వేలాన్ని ఆపాలన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం జగన్‌ను కలిసి అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News