బెంగళూరు: 2023లో దేశంలో సాధరాణం కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ సోమవారం తెలిపింది. ‘ఎల్‌నినో సంభావ్యత పెరుగుతోంది, రుతుపవనాల సమయంలో దాని సంభావ్యత ఎక్కువ పెరుగుతోంది. ఎల్‌నినో తిరిగి రావడం బలహీన రుతుపవనాలను సూచించవచ్చు’ అని స్కైమెట్ డైరెక్టర్ జతిన్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
భారత దేశంలో రుతుపవనాల వర్షాలు దీర్ఘకాలిక సగటులో 94 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు స్కైమెట్ తెలిపింది. సబ్‌పార్ మాన్‌సూన్ గురించి తన మునుపటి వీక్షణను యథతథంగా నిలుపుకుంది.
జూన్‌లో ప్రారంభమయ్యే నాలుగు నెలల సీజన్‌లో 50 సంవత్సరాల సగటు 88 సెమీ. (35 అంగుళాలు)లో 96 శాతం 104 శాతం సగటు లేదా సాధారణ వర్షపాతాన్ని న్యూఢిల్లీ నిర్వచించింది. ప్రభుత్వ ఆధీనంలోని భారత వాతావరణ శాఖ తన వార్షిక మాన్‌సూన్ అంచనాలు ప్రకటించే అవకాశం ఉంది.
భారత దేశంలో సగం మేరకు వ్యవసాయ భూములు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వానాలపైనే ఆధారపడతాయి. ఈ కాలంలో ముఖ్యంగా వరి, మొక్క, చెరకు, పత్తి, సోయాబీన్ పంటలు పండిస్తారు. సెంట్రల్ ఇండియా ప్రాంతంలో వర్షపాతం కొరతగానే ఉండనున్నదని స్కైమెట్ తెలిపింది. పంజాబ్, హర్యాన, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఉత్తర భారత దేశం ‘అగ్రికల్చర్ బౌల్’గా పిలువబడుతుంటాయి. అయితే అక్కడ ఈ సారి సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే ఉండనున్నదని భావిస్తున్నారు. ఇదిలావుండగా అకాల వర్షాలు చేతికొచ్చిన పంటను దెబ్బతీశాయి. వేలాది మంది రైతులకు నష్టం కలిగించాయి. దీంతో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం మరింత పెరుగనున్నది.