Friday, December 20, 2024

7వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న వండర్‌లా హైదరాబాద్‌..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: భారతదేశంలో సుప్రసిద్ధ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ చైన్‌, వండర్‌లా హాలీడేస్‌ లిమిటెడ్‌, తమ హైదరాబాద్‌ పార్క్‌ ఏడవ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. ఏప్రిల్‌ నెలలో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్శకులు వార్షికోత్సవ ఆఫర్‌ ‘ఒకటి కొంటే ఒకటి ఉచితంగా పొందండి’ ఆఫర్‌ను వండర్‌లా హైదరాబాద్‌ను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించిన వేళ పొందవచ్చు. ఈ ఆఫర్‌ 30 ఏప్రిల్‌ 2023 వరకూ అందుబాటులో ఉంటుంది.

‘‘ ఏడు సంవత్సరాలను పూర్తి చేసుకోవడమనేది మాకు ఓ మైలురాయి, మా ఎక్స్‌టెండెడ్‌ ఫ్యామిలీతో దీనిని వేడుక చేస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. నిరంతరమూ తమ మద్దతు, ప్రేమను చూపుతున్న మా సందర్శకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. రాబోయే సంవత్సరాలలో సంయుక్తంగా మరిన్ని నూతన శిఖరాలను చేరగలమని ఆశిస్తున్నాము’’ అని అరుణ్‌ కె చిట్టిలాపిళ్లి, మేనేజింగ్‌ డైరెక్టర్‌–వండర్‌లా హాలీడేస్‌ లిమిటెడ్‌ అన్నారు.

వండర్‌లా హైదరాబాద్‌ పార్క్‌ను 2016లో ప్రారంభించారు. వినోదం, ఉత్సాహాల కేంద్రంగా నిలిచిన వండర్‌లా హైదరాబాద్‌లో 46 థ్రిల్లింగ్‌ రైడ్స్‌ ఉన్నాయి. వీటిలో ల్యాండ్‌, నీరు, చిన్నారులు మరియు హై థ్రిల్‌ రైడ్స్‌ కూడా ఉన్నాయి. అంతేకాదు, ఈ పార్క్‌ వైవిధ్యమైన ఇండోర్‌ మరియు ఇతర ఆకర్షణలను సైతం అందిస్తుంది. ఇవి ఖచ్చితంగా అన్ని వయసుల సందర్శకులనూ ఆకట్టుకుంటాయి.

వేసవి సీజన్‌ ప్రారంభమైన వేళ, వండర్‌లా ఇప్పుడు పార్క్‌ వద్ద సమ్మర్‌ ఫియస్టాను ప్రకటించింది. ఇది ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 11 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ఫియస్టాలో సందర్శకులు ఉత్సాహపూరితమైన యాక్టివిటీలను పొందవచ్చు. వీటిలో థ్రిల్లింగ్‌ రైడ్స్‌, ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రత్యేక షోస్‌ మరియు మరెన్నో ఉంటాయి.

సందర్శకులు తమ ప్రవేశ టిక్కెట్లను ముందుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ https://bookings.wonderla.com/ వద్ద బుక్‌ చేసుకోవడాన్ని వండర్‌లా ప్రోత్సహిస్తుంది. వినియోగదారులు నేరుగా తమ టిక్కెట్లను పార్క్‌ కౌంటర్ల వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. మరింత సమాచారం కోసం www.wonderla.com చూడవచ్చు లేదా 0841 4676333,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News