Friday, December 20, 2024

‘బిబిసి ప్రభుత్వ మీడియా సంస్థ’.. ట్విట్టర్ ఆరోపణను ఖండించిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్

- Advertisement -
- Advertisement -

లండన్: మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ బిబిసిని ప్రభుత్వ నిధులతో కూడిన మీడియా సంస్థగా పేర్కొంది. దీనిపై బ్రిటిష్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ సోమవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు సోషల్ మీడియా దిగ్గజాన్ని సంప్రదించినట్లు యుకె మీడియా కార్పొరేషన్ తెలిపింది. బిబిసి ఎల్లప్పుడూ స్వతంత్రంగా వ్యవహరిస్తోందని మీడియా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. లైసెన్స్ రుసుము ద్వారా బ్రిటిష్ ప్రజల నుంచి నిధులు పొందుతామని బిబిసి ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News