Saturday, December 21, 2024

రాముడెవరో..రావణుడెవరో ప్రజలే నిర్ణయిస్తారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తంగళ్లపల్లి ః రాముడెవరో..రావణుడెవరో రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో దళిత బందు పథకం ద్వారా లబ్ది పొందిన వారితో సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.గ్రామంలో దళిబందు ద్వారా 34 మంది లబ్దిదారులు ఎంపిక కాగా వారిలో ఫౌల్ట్రి ఫామ్‌ను ఏర్పాటు చేయగా దాన్ని కెటిఆర్ ప్రారంబించారు.

అనంతరం గ్రామంలో సావిత్రిబాయి పూలే,అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 40వేల మందికి దళిత బందు పథకం వర్తింపజేశామన్నారు.ఈ పథకం ద్వారా ఎంతో మంది దళిత కుటుంబాలు ఆర్థిక పురోభివృద్ది సాదిస్తున్నాయన్నారు.దమ్మున్న సిఎం కెసిఆర్ ఉన్నాడు కాబట్లే సంపద సృష్టించి పేదలకు పంచిపెడుతున్నారన్నారు.ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని ఖలేజా ఉన్న నాయకుడు సిఎ కెసిఆర్ అని కొనియాడారు.రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామం,నర్సరీ,డంపింగ్ యార్ఢ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణపై విషం చిమ్మే బిజెపి పార్టీయే దేశంలో సర్వే చేస్తే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తెలంగాణలోని పల్లెలకు దక్కుతున్నాయని అభివృద్దిలో ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలన్నారు.పట్టణ ప్రగతి,పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున అభివృద్దికి నిధులను కేటాయిస్తున్నామని గుర్తు చేశారు.అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.కాంగ్రెస్,బిజెపి పార్టీల నేతల ఇండ్లకు కూడా సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు వర్తింప జేస్తున్నామన్నారు.ఒకప్పుడు కరెంట్ వస్తే వార్త అయ్యేదని ఇప్పుడు కరెంట్ పోతే వార్త అవుతోందని అన్నారు.కేవలం గండిలచ్చపేట గ్రామానికి రూ.6 కోట్ల 89లక్షల నిధులను అభివృద్ది సంక్షేమం కోసం ఖర్చుపెట్టినట్లు చెప్పారు.

అలాగే మానేరు వాగు తీరాన 24 చెక్ డ్యాములను నిర్మించినట్లు తెలిపారు.వేసవికాలంలో సైతం నీటి ఊట ఉండటంతో మరిన్ని చెక్ డ్యాంలను ఏర్పాటు చేయాలని అధికారులు కోరుతున్నారని వాటిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.ఇంకా ఎవరైనా ప్రభుత్వ పథకాల అందని వారు ఉంటే ఏదో రూపేనా వారికి సహకారాలు అందిస్తామన్నారు.ఇప్పటికే గృహలక్ష్మి పథకం ద్వారా సొంత జాగా ఉండి ఇళ్లు నిర్మిచుకునే వారికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు.కంటి వెలుగు కార్యక్రమం ఎంతో గొప్పదని వాటికి ప్రజల నుండి వస్తున్న ఆదరణే గొప్ప నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు,జడ్పి చైర్మన్ న్యాలకొండ అరుణ,పవర్‌లూం కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,సర్పంచ్ నీరటి లక్ష్మి,వైస్ ఎంపిపి జంగిటి అంజయ్య,దళిత బందు లబ్దిదారులు,గ్రామస్థులు,బిఆర్‌ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News