Monday, December 23, 2024

ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలో ఇంజక్షన్ వికటించి అవినాష్(12) అనే బాలుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అవినాష్‌కు కడుపు నొప్పి ఎక్కువ కావడంతో స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్ సముద్రాల శంకర్ మూడు ఇంజక్షన్లు ఇవ్వడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

ఈక్రమంలో ఎంజిఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అవినాష్ చనిపోయాడు. ఆర్‌ఎంపి డాక్టర్ శంకర్ ఇచ్చిన ఇంజక్షన్‌లు వికటించడం వల్ల తన కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News