- Advertisement -
హైదరాబాద్: ఐపిఎల్ 16వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసింది.
ఓపెనర్లు విరాట్ కోహ్లీ(61), కెప్టెన్ డు ప్లెసిస్(79)తోపాటు మాక్స్ వెల్(55)లు అర్థ శతకాలతో చెలరేగారు. దీంతో బెంగళూరు, లక్నోకు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
- Advertisement -