Sunday, December 22, 2024

‘ప్రాజెక్ట్ కె’ అసెంబ్లింగ్ ది రైడర్స్

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఇండియన్ మూవీ. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. సినిమా యూనిట్ యూనిక్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. అందులో భాగంగా ఫ్రమ్ స్క్రాచ్ పేరుతో ప్రీ ప్రొడక్షన్ పనుల వీడియోను విడుదల చేస్తున్నారు. ఎపిసోడ్ వన్- ప్రత్యేకంగా రూపొందించిన చక్రం తయారీని చూపించింది. సోమవారం ఎపిసోడ్ 2- అసెంబ్లింగ్ ది రైడర్స్‌ని విడుదల చేశారు. రైడర్స్ ఎవరు? చర్చల తరువాత అది విలన్ ఆర్మీ యూనిఫాం సైన్ అని తెలుస్తుంది. ఇది సినిమాలో అత్యంత ఖరీదైన భాగమని నిర్మాత తెలియజేశారు.

దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా మరో లెవల్‌గా ఉండబోతోంది. 50 మెమరబుల్స్ ఇయర్స్ జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అశ్విని దత్ నిర్మాత. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News