Monday, December 23, 2024

కెసిఆర్ వంద మంది దావూద్ ఇబ్రాహీంలకు సమానం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ప్రమాదకారి అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం గాంధీ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. భూకబ్జాలకు సంబంధించి తాను సిబిఐకి లేఖ రాస్తానన్నారు. కెసిఆర్ వంద మంది దావూద్ ఇబ్రాహీంలకు సమానమన్నారు. కెసిఆర్‌తో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు కుదుర్చుకోదని అన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకు నేతృత్వం వహించేందుకు కెసిఆర్ ఆసక్తి కనబరుస్తున్నారని జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయి చేసిన ప్రకటనపై రేవంత్ రెడ్డి స్పందించారు. కెసిఆర్ మోడల్ చాలా ప్రమాదకరమని అన్నారు. అవకతవకలు(మాల్‌ప్రాక్టీస్) ద్వారా కెసిఆర్ లక్ష కోట్ల రూపాయలు సంపాదించారని, భూకబ్జాల ద్వారా ఆయన వందలాది కోట్ల రూపాయలు గడిస్తున్నారని అన్నారు. దేశాన్ని పాలించాలనే స్వప్నంతో కెసిఆర్ ఎన్నికల్లో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

కెసిఆర్‌కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో భూకబ్జాల ద్వారానే ఆయన అంతగా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. హిత్రూ కంపెనీ యజమానితో కెసిఆర్ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన ఇంటిపై సిబిఐ, ఈడి దాడులు చేయగా, ఐటి దాడుల్లో రూ. 142 కోట్లు దొరికాయని ఆరోపించారు. యశోధ హాస్పిటల్స్‌కు భూకేటాయింపులపై మంగళవారం జరిగిన లావాదేవీలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News