సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైెరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. మంగళవారం (ఏప్రిల్ 11) రోజున ఈ సినిమా ట్రైలర్ స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా…
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ప్రతి మనిసికి ఓ లైఫ్ జర్నీ ఉంటుంది. అందులో పడటం, లేవటం అనేది సాధారణంగానే జరుగుతుంటాయి. అలా సాయిధరమ్ తేజ్ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలో దేవుడు యాక్సిడెంట్ రూపంలో చిన్న బ్రేక్ వేశాడు. అయితే తను దాంట్లో నుంచి రికవర్ అయ్యి చేస్తున్న మొదటి సినిమా ‘విరూపాక్ష’. ట్రైలర్ చూశాక వాట్ ఎ ట్రైలర్ అనిపించింది. కొత్త డైరెక్టర్ కార్తీక్, సుకుమార్ డైరెక్షన్‌లో బాపినీడు, ప్రసాద్‌గారి ప్రొడక్షన్‌లో ఓ వేల్యూస్‌తో పాటు ట్రైలర్ చూస్తుంటే గూజ్ బమ్స్ వచ్చాయి.
రేపు సినిమా ఎలా ఉండబోతుందో చూపించారు. ఆల్ ది బెస్ట్ టీమ్. తేజుకి ఇది రీ ఎంట్రీ. తేజు నిన్న ఫోన్ చేసి ‘సార్! నా ఫస్ట్ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం మీరు అరవింద్‌గారే చేశారు. ఇప్పుడు ఇది నా రీ ఎంట్రీలాంటిది. మీరు రావాలి’ అని అన్నాడు. తేజు ఫస్ట్ అనే కాదు.. ఎప్పుడు ఏ సాయం అడిగినా నేను, అరవింద్‌గారు చేయటానికి రెడీగా ఉంటాం. ట్రైలర్ చాలా బావుంది. ఈ నెల 21న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా కంటెంట్ కనిపిస్తుంది. పెద్ద సక్సెస్ అవుతుంది. నైజాం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఈ సక్సెస్‌లో నేను కూడా ఓ పార్ట్ అవుతాను’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు కార్తీక్ కథ నెరేట్ చేయగానే సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేశాను. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పటమే కాదు.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని చెప్పాను. రేపు అదే నిజమవుతుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, నా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్. చాలా మంచి టీమ్ కుదిరింది. సాయిధరమ్‌గారితో ఎప్పుడో పని చేయాల్సింది. కానీ కుదరలేదు. విరూపాక్షకు పనిచేసే అవకాశం రావటం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు.
చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌గారి వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌గారు టీజర్ లాంచ్ చేశారు. ఇప్పుడు రాజుగారు, అరవింద్‌గారు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అన్ని పాజిటివ్‌గానే కుదిరాయి. బాపినీడు అధ్వర్యంలో చేసిన సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ఎంతో ప్రేమించి, కష్టపడి చేసిన సినిమా. ఓ మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ నెల 21 థియేటర్స్‌లో అందరం కలుద్దాం. బ్లాక్ బస్టర్ న్యూస్‌తో మాట్లాడుకుందాం. అందరూ సపోర్ట్ చేయండి. అమ్మా ఈ సినిమా నీకోసం. ఐ లవ్ యు అమ్మ. నేను అడిగిన తర్వాత సపోర్ట్ చేయటానికి వచ్చిన నా తొలి సినిమా నిర్మాతలు దిల్ రాజు, అరవింద్‌గారికి థాంక్స్’’ అన్నారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘తేజు ఫోన్ చేయగానే గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తానిన చెబుతాడని అనుకుంటే ట్రైలర్‌కి రమ్మన్నాడు. తను పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. తేజుకి యాక్సిడెంట్ అయ్యినప్పుడు తనకు వెంటనే ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్స్ ..తేజుకి ఎక్కడా మేజర్‌గా గాయాలు కాలేదు. తనకేం కాదు.. బతుకుతాడు అని 15 నిమిషాల్లో చెప్పారు. తను అక్కడి నుంచి లేచి ఇప్పుడు విరూపాక్ష సినిమాలో చింపేశాడని అందరూ అంటుంటే వినటానికి చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య సినిమాలకు ట్రైలర్ బట్టి ఓపెనింగ్స్ వస్తున్నాయి.
విరూపాక్ష ట్రైలర్ చూస్తుంటే పిచ్చ రేంజ్‌లో ఓపెనింగ్స్ వస్తాయని 100% అనిపిస్తుంది. బాపినీడు, ప్రసాద్‌గారితో చాలా కాలం జర్నీ ఉంది. బాపినీడు ఈ సినిమాను మన అందరికీ నచ్చేలా తీసుంటాడని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అన్ని డిపార్ట్‌మెంట్స్ పడ్డ కష్టం తెలుస్తుంది. కాంతార చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించటం హ్యాపీ. అన్ని కలిసొచ్చి ఈ సినిమా ఎక్కడో నిలబడుతుంది’’ అన్నారు.