ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లోనే ముగిశాయి. దీంతో వరుసగా ఏడో రోజూ లాభాలను కొనసాగాయి. లోహ, బ్యాంక్ స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ 311.21 పాయింట్లు లేక 0.52 శాతం పెరిగి 60157.72 వద్ద ముగియగా, నిఫ్టీ 98.25 పాయింట్లు లేక 0.56 శాతం పెరిగి 17722.30 వద్ద ముగిసింది. నిఫ్టీలో కొటక్ బ్యాంక్, జెఎస్‌డబ్లు, బజాజ్ ఆటో, ఐషెర్ మోటార్స్ లాభపడగా, టిసిఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో నష్టపోయాయి.
ఇక అమెరికా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 0.14 పైసలు పెరిగి రూ.82.13 వద్ద ట్రేడయింది. కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 333.00 లేక 0.55 శాతం పెరిగి 60396.00 వద్ద ట్రేడయింది. ఛార్టుల ప్రకారం వోలాటిలిటీ ఉన్నప్పటికీ నిఫ్టీ ఇంకా పైకి పోవచ్చని అనుకుంటున్నారు. నిఫ్టీ రెసిస్టెన్స్ 17700 నుంచి 17730 మధ్యన ఉండనున్నది. నిఫ్టీ 17800స్థాయిని దాటితే మాత్రం తదుపరి టార్గెట్ 18200 ఉండనున్నది. దాని సపోర్టు 17650 కానుందని హెచ్‌డిఎఫ్‌సి టెక్నికల్ రీసెర్చ్ విశ్లేషకుడు నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు.
ఏది ఏమైనప్పటికీ కీలక మద్దతు 17655 నుంచి 17650 మధ్యన ఉండనున్నది. తదుపరి కీలక రెసిస్టెన్స్ 17700 నుంచి 17730 మధ్య ఉండనున్నది. ఇప్పటికీ అప్‌ట్రెండ్‌కే అవకాశం ఉండనున్నది. తదుపరి టార్గెట్ 17800 కాగలదు.