- Advertisement -
కోల్‌కతా: ఎన్నికల కమిషన్ తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా రద్దు చేయడంపై సవాలు చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ సంసిద్ధమౌతోంది. ఈమేరకు చట్టపరమైన అవకాశాలేమి ఉన్నాయో అన్వేషిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈసీ నిర్ణయం తరువాత టిఎంసి నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. విపక్షం బీజేపీ మాత్రం ఎద్దేవా చేసింది. మమతా బెనర్జీ తమ పార్టీపై ఎంతో ఆశ పెట్టుకున్నా ఆ పార్టీకి ఎలాంటి స్థానం కనిపించలేదని, కేవలం ప్రాంతీయ పార్టీగానే మిగిలిపోయిందని బీజేపీ వ్యాఖ్యానించింది.
- Advertisement -