అమరావతి: అక్కటెల్లెమ్మలకు సెల్యూట్ అని, అన్నివిధాలా మహిళలను ఆదుకుంటున్నామని సిఎం జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్‌ఆర్ ఇబిసి నేస్తం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు అని ప్రశంసించారు. తమది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, పేదరికానికి కులం, మతం ఉందన్నారు. దేశంలో ఇబిసి నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదన్నారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు.
Also Read: జాతరలో పరిటాల శ్రీరామ్….. పిలిచిన వ్యక్తిపై కర్రలతో దాడి
ఒసి వర్గాల్లోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే తమ లక్షమన్నారు. మహిళల సాధికారత కోసం అనే పథకాలు తీసుకొస్తున్నామని, మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఒక్కో ఇంటికి విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఇబిసి నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావని జగన్ తెలిపారు. 46 నెలల్లో 2.07 లక్షల కోట్లు డిబిటి ద్వారా లబ్ధిదారులకు అందించామని, రూ.1.42 లక్షల కోట్లు మహిళ ఖాతాల్లో నేరుగా జమ చేశామని వివరించారు. 41.77 లక్షల మందికి మహిళలకు వైఎస్‌ఆర్ పెన్షన్ పథకం తీసుకొచ్చామని, 30 లక్షల మందికి ఇళ్లపట్టాలిచ్చామన్నారు.
Also Read: గోమూత్రం వద్దు.. గేదె మూత్రం బెటర్: ఐవిఆర్‌ఐ శాస్త్రవేత్తలు