Monday, December 23, 2024

కదులుతున్న రైలులో ప్రయాణికుడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: కదులుతున్న రైలులో వ్యక్తి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం జల్పాయిగురి స్టేషన్‌లో జరిగింది. రైల్లే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జల్పయిగురి రైల్వే స్టేషన్‌లో మూడో ప్లాట్‌ఫామ్‌కి వస్తుండగా జనరల్ బోగీలో ఉన్న ప్రయాణికులు గన్ బ్యాగ్‌లో నుంచి తీసి తన తలపై కాల్చుకున్నాడు.

Also Read: వధువు చేతిలో పిస్టల్..వరుడికి టెన్షన్(వైరల్ వీడియో)

వెంటనే పక్కన ఉన్న ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్‌పిఎఫ్ సిబ్బంది కపార్ట్‌మెంట్‌లోకి చేరుకున్నారు. ఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతదేహంతో పాటు గన్‌ను స్వాధీనంచేసుకున్నారు. తలపై మూడు రౌడ్లు కాల్చుకున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి వద్ద టికెట్ లేదని రైల్వే పోలీస్ అధికారి పి సెల్వమురుగన్ వెల్లడించారు. అతడి వద్ద ఐడి కార్డులు ఉన్నట్టు గుర్తించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News