Monday, December 23, 2024

ఎపి ప్రజలను గాలికొదిలేశారు: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

జోగిపేట: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ‘నా వ్యాఖ్యలపై ఎపి మంత్రులు రాద్ధాంతం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న ఎపి వాళ్లకు రెండుచోట్ల ఓట్లున్నాయి. రెండు ఓట్లు ఉంటే హైదరాబాద్ లో ఓటు ఉంచుకోవాలని చెప్పా’ అని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

Also Read:   ‘ఉస్తాద్’ మూవీ టీజర్ విడుదల..

తెలంగాణలో ఏముందో వచ్చి చూస్తే తెలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణలో కల్యాణలక్ష్మి, రైతుబంధు ఇస్తున్నామని హరీశ్ రావు వెల్లడించారు. ఎపికి ప్రత్యేక హోదా అని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు మాట్లాడట్లేదని మంత్రి హరీశ్ విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం ఆనాడు తెదేపా ఎన్డీఏను వీడింది. అదే తెదేపా ఇప్పుడు బిజెపితో దోస్తీ కడుతోంది. రాజకీయాల కోసం ఎపి ప్రజలను గాలికొదిలేశారని మంత్రి పేర్కొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News