Friday, December 20, 2024

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో స్వర్ణం సాధించిన శేజ్రా

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : ఈనెల 11న హైదరాబాద్‌లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి అండర్ 17 కుస్తీ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన శేజ్రా 53 కేజీల కేటగిరిలో పాల్గొని బంగారు పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భక్తవత్సలం సన్మానించి, ప్రోత్సాహకంగా 2000 రూపాయలు అందజేయడం జరిగింది.

కార్యక్రమంలో నిజామాబాద్ ఫైర్ స్టేషన్ అధికారి పి. నర్సింగ్‌రావు, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాజుకుమార్ సుబేదార్, రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రెటరీ ఎం. సురేష్, జాయింట్ సెక్రెటరీ టి. శ్రీనివాస్, పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బంగారు పతకం సాధించిన శేజ్రా పేరెంట్స్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News