హైదరాబాద్: ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి గల్లంతుపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. 2018లో తాళం వేసినప్పటి నుంచి అన్నీ అంశాలపై విచారణ జరిపి, ఈ నెల 26వ తేదీ వరకు నివేదిక సమర్పించాలని ఈసిని కోర్టు ఆదేశించింది. తాళం పగటగొట్టేందుకు ఈసి సలహా తీసుకుని పిటిషన్ వేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
Also Read: బిఆర్‌ఎస్‌పై ఈసి కి ఫిర్యాదు : రఘునందన్‌రావు
2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 441 ఓట్ల స్వల్ప తేడాతో కొప్పుల గెలుపొందడంతో ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ , మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.