- Advertisement -
చెన్నై : సామాజిక కార్యక్రమాల్లో ముందుండే ప్రముఖ నృత్య దర్శకుడు, దర్శకుడు, నటుడు, రాఘవ లారెన్స్ మరోసారి ఉదారత చాటుకున్నారు. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది చిన్నారులకు సాయం చేసిన ఆయన ఇప్పుడు 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నాడు.
వారికి నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తానన్నారు. తన కొత్త సినిమా రుద్రన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ చిన్నారులతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. చెన్నైలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులెవరైనా ఆర్థిక సమస్య కారణంగా చదువుకు దూరమవుతున్నా, ఎవరికైనా గుండె శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడినా లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్‌ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
- Advertisement -