- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికా వేదికగా జరిగిన యుఎస్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలతో సహా మొత్తం నాలుగు పతకాలు లభించాయి. అమెరికాలోని లాస్ వెగాస్ వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్‌లో భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతంతో పాటు మరో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల జూనియర్ 65 కిలోల విభాగంలో మహ్మద్ హుస్సేన్ స్వర్ణం సాధించాడు.
60 కిలోల విభాగంలో ఫతె అలీ పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఇక మహిళల 55 కిలోల జూనియర్ విభాగంలో ఫరీదా సుల్తానా రజత పతకం సాధించింది. ఇక 57 కిలోల విభాగంలో భారత్‌కు చెందిన సఫియా సుల్తానా కాంస్యం సొంతం చేసుకుంది. అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారులు భారత్‌కు ఈ పతకాలు సాధించి పెట్టారు. ప్రధాన కోచ్ ఇఫ్తికార్ హుస్సేన్ పర్యవేక్షణలో వీరు శిక్షణ పొందారు.
- Advertisement -