Friday, November 22, 2024

నదిలో మొసలితో పోరాడి భర్తను కాపాడిన భార్య

- Advertisement -
- Advertisement -

జైపూర్: చంబల్ నదిలో మొసలితో పోరాటం చేసి తన భర్త ప్రాణాలను భార్య కాపాడుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కరౌలీ జిల్లా మండరాయల్ ప్రాంతంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. బనీసింగ్ మీనా(29), విమల అనే దంపతులు మేకలు పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. చంబల్ నది పరివాహక ప్రాంతంలో మేకలను మేపుతుంటారు. ఎండకాలం కావడంతో దప్పిక వేయడంతో బనీసింగ్ మోకల్లోతు నదిలోకి దిగి నీరు తాగుతున్నాడు. ఒక్కసారిగా మొసలి వచ్చి అతడి కాలు పట్టుకోవడంతో కేకలు వేశాడు. మొసలి దాడి చేసిందని కేకలు వేయడంతో కొద్ద దూరంలో ఉన్న భార్య అక్కడికి చేరుకొని చేతిలో ఉన్న కర్రతో మొసలి తలపై పలుమార్లు బాదింది.

Read Also: జాతరలో పరిటాల శ్రీరామ్….. పిలిచిన వ్యక్తిపై కర్రలతో దాడి

దీంతో మొసలి దెబ్బలు తాళలేక కాలును వదిలిపెట్టి నెమ్మదిగా లోపలికి జారుకుంది. వీళ్ల కేకలు విని స్థానిక రైతులు అక్కడికి చేరుకున్నారు. మొసలి దాడిలో తీవ్రంగా గాయపడిన బనీసింగ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తన భర్త ప్రాణాలు పోతాయనే భయంతోనే మొసలిపై దాడి చేశానని విమల చెప్పింది. తన భార్య కాపాడకపోతే మొసలి తన ప్రాణాలు తీసేదని భర్త వాపోయాడు. విమల దైర్యాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. దీంతో భర్త ప్రాణాలను కాపాడిన భార్య సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరో సావిత్రలా తన భర్త ప్రాణాలను కాపాడిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News