హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీపై ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కెసిఆర్ ను ఎదుర్కునే ధైర్యం లేకనే తనపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ చాట్ లతో దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుఖేశ్ తో నాకు ఎలాంటి పరిచయం లేదని కవిత పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: మిసెస్ ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకున్న హైదరాబాద్ మహిళ
బిఆర్ఎస్ ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. ఒక ఆర్థిక నేరగాడు అనామక లేఖ రాస్తే రాద్దాంతం చేస్తున్నారని ఆమె తెలిపారు. లేఖను పట్టుకుని బిజెపి ఎమ్మల్యే రఘనందన్ సీఈసికి లేఖ రాసారన్నారు. బిజెపి టూల్ కిట్ లో భాగంగానే బుదరజల్లే కార్యక్రమం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాస్తవాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రచురించాయని కవిత తెలిపారు. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
Also Read: ప్రయాణికుడి వీరంగం..బయల్దేరిన చోటికే తిరిగొచ్చిన విమానం