అమరావతి: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఆశాజనకంగా ఉందన్నారు. ఎపి ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదని పవన్ విమర్శించారు. విశాఖ ఉక్కు… తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిందని ఆయన వెల్లడించారు.
విశాఖ ఉక్కుపై ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనాయకత్వంతో మాట్లాడానని పవన్ తెలిపారు. ప్రైవేటీకరణ వద్దన్నప్పుడు బిజెపి నేతలు సానుకూలంగా స్పందించారన్నారు. అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కుతో తెలుగు భావోద్వేగాన్ని తెలిపానని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరామన్నారు. ఎపి పాలకులు అఖిలపక్షంతో కేంద్రం వద్దకు వెళ్లాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
Also read: స్టాక్ మార్కెట్‌లో తొమ్మిదో రోజూ బుల్ రన్!
కేంద్రం వద్దకు వెళ్లాలనే ప్రతిపాదనపై వైకాపా నేతలు స్పందించలేదని పవన్ ఆరోపించారు. కొద్ది రోజులుగా విశాఖ ఉక్కుపై తెలంగాణ స్పందిస్తోందని పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. పరిశ్రమ కాపాడతామనే మాట వైకాపా నేతలు చెప్పలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపిందని పవన్ కల్యాన్ పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి
• కేంద్ర మంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉంది
• రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/zvIu85UV4x
— JanaSena Party (@JanaSenaParty) April 13, 2023