Thursday, November 14, 2024

15న ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిరుద్యోగుల బాధలను, ప్రభుత్వ వైఫల్యాలను ‘నిరుద్యోగ మార్చ్’ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న ఓరుగల్లు “నిరుద్యోగ మార్చ్‌” లో పాల్గొనే వారందరికీ “నిరుద్యోగ బాధితుడు # 30” పేరుతో కంకణాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ అనంతరం మిగిలిన ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని పార్టీ నేతలను ఆయన ఆదేశించారు. అన్ని ఉమ్మడి జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీలను నియమించడంతో ఉమ్మడి జిల్లాల వారీగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
 ఓరుగల్లులో బిజెపి “నిరుద్యోగ మార్చ్‌”కు పోలీసుల అనుమతి
‘ఈ నెల 15వ తేదీన హన్మకొండ కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్న “నిరుద్యోగ మార్చ్‌”కు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం అనుమతి ఇచ్చారు. కాకతీయ యూనివర్శిటీతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల్లో నిరుద్యోగ మార్చ్‌కు తరలిరావాలంటూ బిజెపి శ్రేణులు కరపత్రాలు పంపిణీ చేశారు. పాటలు పాడుతూ నిరుద్యోగ మార్చ్‌కు అహ్వానిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ మార్చ్ పోస్టర్లు, ఫ్లెక్సీలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News