Saturday, December 21, 2024

దటీజ్ కెసియార్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ మాస్టర్ స్ట్రోక్స్‌కు కేంద్రం విలవిల్లా డుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కు ప్రై వేటీకరణ కుట్రకు కెసిఆర్ వేసిన ఇఒ ఐ వ్యూహంతో కేంద్రం తుక్కుకాక త ప్పలేదు. నాటి ప్రత్యేక తెలంగాణ ఉ ద్యమం మొదలుకుంటే నేటి విశాఖ ఉక్కు దాకా కేంద్రం మెడలు వంచడంలో కెసి ఆర్ అనుసరిస్తున్న తెగింపు వ్యూహాలే పార్టీకి తి రుగులేని విజయాలను అందిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ సాధించిన తీరులోనే ఆయన ఏ వ్యూ హం రచించినా అది విజయవంతమవుతూనే ఉంది. రాష్ట్రానికి చెందిన బియ్యాన్ని సేకరించ కుండా ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని కేంద్రం బియ్యం సేకరణకు బ్రేక్ వేస్తే 2022 ఏప్రిల్‌ల్లో ఒకరోజు రైతు సంఘాలతో కలిసి దీక్ష చేసి కేం ద్రానికి కెసిఆర్ 24గంటల అల్టిమేటం ఇచ్చా రు. దీంతో కేంద్రం దిగి వచ్చి బియ్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించింది.

ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ లే కాకుండా జాతీయ స్థాయిలో పార్టీలు కూడా ఉ లిక్కిపడ్డాయి. ఒక రకంగా తామెందుకు ఈ పని చేయలేకపోయామని ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, విపక్షాలు డిఫెన్స్‌లో పడ్డాయి. ఆ పార్టీలకు ఎలా ప్రజల ముందు సమాధానం చెప్పుకోవా లో తెలియక సతమతమయ్యాయి. మరోవైపు వి శాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తెర వెనుక వ్యూహం రచించిన కేంద్రం దిమ్మతిరిగింది. తెలంగాణ ప్ర భుత్వ ఆధ్వర్యంలోని సింగరేణి బిడ్డింగ్‌లో పా ల్గొంటే తాము మద్దతు తెలిపే కార్పొరేట్ కంపెనీ లు ఎలా పోటీ పడతాయని కేంద్రంలోని పెద్దలు ఆందోళన చెందారు. మరోవైపు రెండు రాష్ట్రాల కు సెంటిమెంట్‌గా వున్న విశాఖ ఉక్కును రక్షించాలనే నినాదాలు ఆందోళనలు మిన్నుముట్టా యి. ఈ సెగ చివరికి కేంద్రానికి నేరుగా తాకిం ది. దీంతో వైజాగ్‌కు గురువారం వచ్చిన కేంద్ర ఉక్కు సహాయ మంత్రి

ఫగన్ సింగ్ కులస్తే వెనక్కి తగ్గక తప్పలేదు. తాము విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి ముందుకు వెళ్ళడం లేదని దీనికి బదులు ఆర్‌ఐఎన్‌ఎల్‌ను బలోపేతం చేయడానికి ప్రాధాన్యమిస్తామని చెప్పడంతో ప్రైవేటీకరణకు బ్రేక్ పడినట్లయింది. ఇది అంత సులభంగా సా ధ్యం కాలేదు. దీని వెనుక వ్యూహ రచన, అంత కుమించి కెసిఆర్ ఉక్కు సంకల్పం సైలెంట్‌గా పని చేసి కేంద్రం వెనక్కి తగ్గకక తప్పని పరిస్థితి కల్పించింది. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన తర్వాత పొరుగున వున్న మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో 20 వేల ఎకరాల భూమి, రూ. 3 లక్షల కోట్ల విలువైన ఆస్తులు, 5 లక్షల మంది ప్రజల జీవితాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడిపడిన విశాఖ ఉక్కు కేంద్రానికి అనుకూలంగా వున్న కార్పొరేట్ కంపెనీల పరం కాకుండా ఒక్క అస్త్రంతో అడ్డుకోగలిగారు.

వైజాగ్‌లోని ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో నడిచే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహణకు మూలధనం, ముడి సరకుల కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఏప్రిల్ 15 వరకు ఈ రంగంలోని కంపెనీలు గాని, ముడి సరకులు అందించే కంపెనీలు గాని టెండర్ బిడ్డింగ్‌లో పాల్గొని నిధులు సమకూర్చడంతో పాటు ఉత్పత్తి అయిన ఉక్కును కొనుగోలు చేయాలనేది ఆ ప్రతిపాదనల సారాంశం. కేంద్రం తెర వెనుక వుండి ఆర్‌ఎన్‌ఐల ద్వారా ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తే బిజెపికి అనుకూలంగా వుండే కార్పొరేట్ కంపెనీలను టెండర్ వేయించి క్రమక్రమంగా మొత్తం విశాఖ ఉక్కునే ప్రవేటుపరం చేయాలనేది కేంద్రం ఆలోచన. ఎప్పుడైతే ఆసక్తి వ్యక్తీకరణను కేంద్రం ఆహ్వానించిందో అప్పుడే అక్కడి కార్మిక సంఘాలు తెర వెనుక కుట్రను గమనించాయి.
ప్రైవేటు వ్యక్తులు వస్తే ఉక్కు పరాధీనం కావడం సంగతి అలా వుంచితే దీనిపై ఆధారపడిన 35 వేల మంది కార్మికుల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆ సంఘాలు గ్రహించాయి. 32 మంది ఆందోళనకారుల బలి దానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కును ఎలాగైనా రక్షించుకోవాలని కార్మిక సంఘాలు రోడ్ల పైకి వచ్చి సుదీర్ఘ ఆందోళనలు చేశాయి. కాని అక్కడ అధికారంలో వున్న వైఎస్‌ఆర్‌సిపి గాని, విపక్షంలో వున్న తెలుగు దేశం పార్టీ గాని కేంద్రం తెర వెనుక కుట్రను బలంగా అడ్డుకొనే ప్రయత్నాలు చేయలేదు. నామమాత్రంగా ఆందోళనలు కొనసాగించాయి. ఇది గమనించిన కార్మిక సంఘాలు ఇక అక్కడ పార్టీలతో ప్రయోజనం లేదని తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ను కలిశాయి.

మొత్తం విశాఖ ఉక్కు ప్రస్తుత పరిస్థితిని, దానిని ఎలా ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలో వివరాలు పూర్తి స్థాయిలో అందించాయి. దీనితో కెటిఆర్ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటూ హెచ్చరించారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఖమ్మం సభలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, ఒక వేళ కేంద్రం ప్రైవేటీకరించినా తాము అధికారంలోకి రాగానే మళ్ళీ జాతీయం చేస్తామని ఇదే తమ విధానమని ప్రకటించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ బిజెపి విధానమైతే జాతీయకరణ తమ విధానమని కెసిఆర్ కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొనే వ్యూహాన్ని రచించి అది విజయవంతమయ్యేలా చూశారు. తెలంగాణలోని బయ్యారంకు సమీపంలోనే వున్న బైలడిల్ల గనులను మోడీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితులైన అదానీకి కేటాయించారు. అప్పటి నుంచే ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి ఆమోదం తెలపకుండా వుండడం, వైజాగ్ ఉక్కును నిర్వహణ వైఫల్యం పేరిట అదానీకో, ఆయన బినామీలకో అప్పజెప్పాలనే ఇఒఐని ప్రకటించింది. కాని ఈ వ్యూహానికి కెసిఆర్ ఆదిలోనే బ్రేక్ వేసి సింగరేణి అధికారులను వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీకి అధ్యయనానికి పంపించారు. ఉక్కు ఫ్యాక్టరీని ఎలా రక్షించాలి, ఎలా లాభదాయకంగా నడపాలి,

ఎన్ని నిధులు అవసరమో, ఎంత మూలధనం అవసరమో లాంటి వివరాలు తెలుసుకోవాలని సింగరేణి అధికారులను ఆదేశించడం వారు ఆ పనిని ఆఘమేగాల మీద పూర్తి చేసుకొని వచ్చారు. దీనితో కేంద్రం పునరాలోచనలో పడింది. బిడ్డింగ్‌లో తెలంగాణ విజయం సాధిస్తే దాని కంటే బిఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో వచ్చే మైలేజీని అంచనా వేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఎక్కడ జరిగినా కెసిఆర్ ఇదే తరహాలో అడ్డుకుంటే ప్రజల్లో వచ్చే సానుభూతి బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా పరిణమిస్తుందని కేంద్రం గ్రహించక తప్పలేదు. దీనితో కేంద్రానికి చెందిన ఆ శాఖ మంత్రి కులస్తే ద్వారా ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని ప్రకటించక తప్పలేదు.
కేంద్రం ఏం చేయాలి?
ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని ప్రకటించటమే కాకుండా కేంద్రం మరికొన్ని చర్యలు తీసుకుంటే తప్ప ప్రజల్లో ముఖ్యంగా కార్మిక సంఘాల్లో విశ్వాసం ఏర్పడదు. తక్షణమే కేంద్రం ఇఒఐను పక్కనపెట్టాలి. ఈ ప్రక్రియను ఆపడమే కాకుండా విశాఖ ఉక్కు నిర్వహణకు అవసరమైన పెట్టుబడి సాయం ప్రకటించాలి. ఉక్కు ఉత్పత్తికి అవసరమైన క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి. మొత్తంగా విశాఖ ఉక్కు స్వయం సంవృద్ధి సాధించేలా ప్యాకేజీ ప్రకటించాలి. గతంలో ప్రధానులుగా ఉన్న పివి నరసింహరావు, వాజ్‌పేయి హయాంలో కూడా ఉక్కు ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొన్నప్పుడు వారు ప్రత్యేక పెట్టుబడి సాయాన్ని ప్రకటించి ఉక్కు ఫ్యాక్టరీని రక్షించారు. అదే తరహాలో కేంద్రం చర్యలు తీసుకుంటే తప్ప ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News