Friday, December 20, 2024

చంద్రబాబు జిత్తుల మారి నక్క: కొడాలి నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గుడివాడకు చేసిందేమీ లేదని వైసిపి ఎంఎల్‌ఎ కొడాలి నాని విమర్శించారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టిడిపి ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపించగలరా?, గుడివాడలో 23 వేల మందికి ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని, చంద్రబాబు జిత్తుల మారి నక్క అని విమర్శించారు. ఎపి ప్రజలు బాబును విశ్వసించే పరిస్థితి లేదని, సభలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారని, 42 ఏళ్ల తరువాత అత్తారింటికి వెళ్లిన చంద్రబాబు బస్సులో పడుకున్నారని చురకలంటించారు.

Also Read: ప్రేమదేశం ఆఫర్‌ను కాలదన్నుకున్న హీరోయిన్లు

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టలేదని, తాను, జూనియర్ ఎస్‌టిఆర్‌లు కలిసి విగ్రహాలు ఏర్పాటు చేశామని, తాము పెట్టిన విగ్రహాలకు చంద్రబాబు దండలు వేశారని కొడాలి నాని దుయ్యబట్టారు. హరికృష్ణ ఎంపిగా ఉన్నప్పుడు నిమ్మకూరును అభివృద్ధి చేశారని, నిమ్మకూరును ఉద్దరించామని చెబితే ఎవరు నమ్ముతారని, హరికృష్ణ, ఎన్‌టిఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు పెట్టేది టిడిపి మీటింగా?… కమ్మ సంఘం మీటింగా? అని చురకలంటించారు. ఎపిలో చంద్రబాబు ధనిక ఎంఎల్‌ఎగా తేలారని, తన భార్య ఆస్తులను చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News