- Advertisement -
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. గత 24 గంటల్లో 11109 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5,31,064 మంది మృతి చెందారు. ఢిల్లీలో 1527 కరోనా కేసులు, మహారాష్ట్రలో 1086 కేసులు నమోదయ్యాయి. ఎక్స్‌బిబి సబ్ వేరియంట్‌తో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
- Advertisement -