Monday, November 18, 2024

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎన్‌సిపి సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

 

ముంబై: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) ఆలోచిస్తోంది. మే 10వ తేదీన జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 40 నుంచి 45 స్థానాలలో పోటీ చేయాలని ఎన్‌సిపి భావిస్తోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే విషఁమై ఒక ప్రణాళికను ఖరారు చేసేందుకు ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ అధ్యక్షతన శనివారం ముంబైలో పార్టీ నాయకులతో ఒక సమావేశం జరగనున్నది. ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయమై శనివారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో వెల్లడించారు.

Also Read: కర్నాటకలో ముస్లిం కోటాను రద్దు చేయడం తప్పుడు నిర్ణయం: సుప్రీంకోర్టు

కాగా..మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనతో కలసి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సిపి పోటీ చేసింది. ఇప్పటికీ ఆ పార్టీ మహా వికాస్ అఘాడిలో కొనసాగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం బిజెపి, కాంగ్రెస్, జెడియు మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్‌సిపి పోటీ చేస్తుందా లేక ఒంటరిగానే ఎన్నికల్లో తలపడుతుందా అన్న విషయం రేపటి సమావేశంలో తేలే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News