Sunday, November 3, 2024

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు!

- Advertisement -
- Advertisement -

కడప: ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన నాటి మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ శుక్రవారం ఒకరిని కీలక అరెస్టు చేసింది. సిబిఐకి చెందిన ప్రత్యేక పరిశోధన బృందం(సిట్) కడప జిల్లాలోని పులివెందులలో జి.ఉదయ్ కుమార్‌ను అరెస్టు చేసింది. అతడు వివేకానంద రెడ్డి మేనల్లుడు, కడప ఎంపి వై.ఎస్.అవినాశ్ రెడ్డి అనుచరుడు. ఇటీవలి నెలల్లో సిబిఐ అతడిని అనేకసార్లు ప్రశ్నించింది.

సిపిసి 41ఎ సెక్షన్ కింద నోటీసు ఇచ్చాకే సిబిఐ బృందం గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసింది. అతడిని గతంలో కూడా సిబిఐ ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది నవంబర్ నుంచి ఉదయ్‌ని హైదరాబాద్ సిబిఐ కోర్టుకు షిఫ్ట్ చేసింది. సుప్రీంకోర్టు కొత్త ప్రత్యేక పరిశోధన బృందం(సిట్)ను ఏర్పాటుచేశాక కొన్ని వారాల్లోనే ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. ఏప్రిల్ 30కల్లా పరిశోధన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది.

కడప జిల్లాలో తుమ్మలపల్లిలో ఉన్న యూరేనియం గనిలో ఉదయ్ ఉద్యోగి. అతడు గత ఏడాది సిబిఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కడప కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఉదయ్ ఫిర్యాదు, కోర్టు ఆదేశం మేరకు గత ఏడాది ఫిబ్రవరిలో రామ్ సింగ్‌ను పోలీసులు బుక్ చేశారు. హత్య కేసులో తనతో బలవంతంగా తప్పుడు సాక్షాన్ని ఆ అధికారి ఇప్పించాడని ఉదయ్ ఫిర్యాదు చేశాడు. ఏదిఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తర్వాత సిబిఐ ఎస్పీకి వ్యతిరేకంగా దాఖలైన ఆ కేసుపై స్టే ఇచ్చింది.

వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున ఆయన ఇంటికి ఉదయ్, అవినాశ్ రెడ్డి, శివ శంకర్‌లతో కలిసి వెళ్లాడని భావిస్తున్నారు. వివేకానంద రెడ్డి సోదరుడు, అవినాశ్ రెడ్డి తండ్రి అయిన వై.ఎస్.భాస్కర్ రెడ్డి ఇంట్లో నాడు ఉదయ్ ఉన్నాడని ఆరోపణ. వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న కడప జిల్లాలోని పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి స్వయాన చిన్నాన్న అవుతారు. పార్లమెంటు మాజీ సభ్యుడైన 68 ఏళ్ల వివేకానంద రెడ్డి ఇంటిలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ఆయనని హత్య చేశారు. ఈ కేసును సిబిఐ 2020 నుంచి నేటి వరకు పరిశోధిస్తూనే ఉంది. కాగా వివేకానంద రెడ్ది కూతురు సునీత రెడ్డి కొందరు బంధువులపై అనుమానాన్ని వ్యక్తం చేయడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మళ్లీ సిబిఐ దర్యాప్తులో చలనం వచ్చింది.

హత్య కేసులో వివేకానంద రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆప్ర. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కజిన్ అయిన అవినాశ్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News