- Advertisement -
ఉధంపూర్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో శుక్రవారం ఓ నడవ వంతెన కూలిపోవడంతో కనీసం 20 మందిగాయపడ్డారు. వారంతా నేడు బైశాఖి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉధంపూర్‌కు చెందిన చెనాని బ్లాక్‌లో బెయిన్ గ్రామంలో బేణి సంగం వద్ద ఈ నడవ వంతెన కూలిపోయింది. ప్రమాదం జరిగిన ఆ చోట క్షతగాత్రులు భోరుమనడం, బెంబేలెత్తి అరవడం తాలూకు వీడియో కూడా ఇప్పుడు వెలుగుచూసింది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, పోలీసులు, ఇతర బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయని ఉధంపూర్ ఎస్‌ఎస్‌పి డాక్టర్ వినోద్ తెలిపారు.
- Advertisement -