- Advertisement -
ముంబై : బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.62 వేల మార్క్ దగ్గరకు చేరుకుంది. శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ.61,950(24 క్యారెట్), 22 క్యారెట్ పసిడి సగటున రూ.56,800కు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా కిలో రూ.410 పెరిగి రూ.77,580కి చేరుకుంది. ఢిల్లీలో స్పాట్ గోల్డ్ ధరలు చూస్తే, 10 గ్రాములు ధర రూ.480 పెరిగి రూ.61,780కు చేరిందని
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమి గాంధీ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో గోల్డ్ రేటు 24 క్యారెట్ 10 గ్రాములు రూ.61,800, 22 క్యారెట్ రూ.56,650 ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా ఔన్స్ 2,041 డాలర్లు, 25.88 డాలర్లుగా ఉన్నాయి. డాలర్ ఇండెక్స్, రేట్లలో ధరలు పడిపోవడం వల్ల కామెక్స్ స్పాట్ గోల్డ్ ధరలు 13 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయని గాంధీ తెలిపారు.
- Advertisement -