Monday, December 23, 2024

బిఎస్6 ఫేజ్ 2.. మే నుంచి పెరగనున్న టాటా కార్ల ధరలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన కార్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు మే 1 నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ తన కార్ల ధరల్లో సగటున 0.6 శాతం పెంచనుంది. వివిధ మోడల్స్, వేరియంట్లకు అనుగుణంగా కారు ధరల పెంపు ఉంటుంది. కార్ల ధరల పెంపునకు ఖర్చులు పెరగడమే కారణమని టాటా మోటార్స్ పేర్కొంది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం అమలు చేసిన బిఎస్6 ఫేజ్ 2 నిబంధనల వల్ల కంపెనీ తన కార్లలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తోంది.

Also read:IPL 2023: నేడు పంజాబ్‌తో లక్నో ఢీ

ఇంతకుముందు మొత్తం భారాన్ని కంపెనీ భరించేది, అయితే ఇప్పుడు దానిలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని ఈ నిర్ణయం తర్వాత టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ వంటి కంపెనీ కార్ల ధరలు రూ.5.54 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరగనున్నాయి. దీనితో పాటు పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి ఎస్‌యూవీ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. టాటా మోటార్స్ జనవరిలో మొదటిసారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది, ఇది ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News