Monday, December 23, 2024

కేక్ కట్ చేసిన కత్తితోనే ప్రియురాలి పీక కోశాడు

- Advertisement -
- Advertisement -

నూస్‌డెస్క్: ప్రేయసి పుట్టినరోజు వేడుకలను జరిపిన ప్రియుడు కేక్ కట్ చేసిన కత్తితోనే ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన శుక్రవారం బెంగళూరులో చోటుచేసుకుంది. కర్నాటక పోలీసు శాఖలోని అంతర్గత భద్రతా విభాగంలో 24 ఏళ్ల నవ్య పనిచేస్తోంది. కనకపురాలో నివసించే ప్రశాంత్ ఆమెను గత ఆరేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వారిద్దరికీ దూరంపు బంధుత్వం కూడా ఉంది. గత మంగళవారం నవ్య పుట్టినరోజు జరుపుకుంది. అయితే బిజీగా ఉన్నానని చెప్పి ప్రశాంత్ ఆమె వద్దకు ఆ రోజు వెళ్లలేదు.

అయితే శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరిపాడు. కేక్ కట్ చేసిన తర్వాత అదే కత్తితో ఆమె పీక కోశాడు. నవ్య అక్కడికక్కడే మరణించింది. ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేయగా ఆమె మరో వ్యక్తితో చాటింగ్ చేస్తోందన్న అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు అతను ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయమై ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు. నవ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News