Saturday, December 21, 2024

గుజరాత్‌లో ఆరుగురు ఆప్ కార్పొరేటర్లు బిజెపిలోకి…

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్‌లో ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. వారు క్యాబినెట్ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ ‘ఆప్ అసలు రంగేమిటో దేశం చూస్తోంది’ అన్నారు.

‘ఆప్ నాయకులు గుజరాత్‌ను అపఖ్యాతి పాలుచేయడానికి ఏదీ వదలలేదు. ఆ రాష్ట్ర ప్రజలని కూడా వదలలేదు. తమ వార్డ్‌లను అభివృద్ధి చేస్తామన్న ప్రతిజ్ఞతో ఆప్ కార్పొరేటర్లు బిజెపిలోకి చేరారు’ అని ఆయన అన్నారు. ఆ కార్పొరేటర్లలో ఒకరైన రూతా ఖేని తాను బిజెపి భావజాలానికి, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ విధానానికి ప్రభావితురాలినయ్యానని తెలిపింది.

ఇదిలావుండగా ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) యూనిట్ కార్పొరేటర్లను బెదిరించడం, నచ్చచెప్పడం ద్వారా బిజెపిలోకి చేరేలా చేశారని ఆరోపించింది. ఓ వీడియోలో బిజెపిలో చేరితే డబ్బు ఇస్తామన్నారని ఆప్ కార్పొరేటర్ దీప్తి సకారియ తెలిపారు.
‘మేము గెలిచినప్పటి నుంచి మాకు ఆఫర్లు ఇస్తున్నారు. బిజెపి మాకు ఆఫర్లు ఇస్తున్నారు. అధికారిక పార్టీలో చేరడానికి రూ. 50 లక్షలు చాలా మంది కార్పొరేటర్లు తీసుకున్నారు’ అని రచనా హిర్‌పరా అనే మరో కార్పొరేటర్ అన్నారు. 2021 ఫిబ్రవరి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 120 స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆప్ 27 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. కాగా బిజెపి 93 సీట్లు గెలుచుకుంది. 2022 ఫిబ్రవరిలో ఆప్‌కు చెందిన ఐదుగురు బిజెపిలోకి మారారు. ఇలా పార్టీని వీడడం వల్ల ఆప్ బలం సూరత్ స్థానిక సంస్థల్లో 17కు తగ్గిపోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News