- Advertisement -
గుండె వైఫల్యానికి గురైన వారు చాలా తక్కువ కాలమే బతుకుతారు. అయితే హార్ట్ ఎటాక్‌ను, ఫెయిల్యూర్‌ను నివారించి గుండె పని తీరు సామర్ధాన్ని పెంపొందించే మాత్రను న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ వర్శిటీ పరిశోధకులు తయారు చేశారు. ఈ మాత్ర పేరు ఏఎఫ్ 130. ఈ మాత్రను జంతువులపై ప్రయోగించి చూడగా మంచి ఫలితాలు వచ్చాయి. ఇది గుండె పంపింగ్ సామర్థాన్ని పెంచుతుందని, జీవితకాలాన్ని తగ్గించే అతి నిద్రలేమి (స్లీప్ ఆష్నియా)ని నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ మాత్రకు త్వరలోనే ఎఫ్‌డిఎ అనుమతి లభిస్తుందని చెప్పారు.
- Advertisement -