- Advertisement -
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీకా జాన్’లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన పాటల్లో సల్మాన్, పూజల మధ్య కనిపించిన కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ‘సల్మాన్ తాజా గర్ల్ ఫ్రెండ్’ అంటూ పూజా గురించి గాసిప్స్ మొదలయ్యాయి. దీనిపై పూజా హెగ్డే మాట్లాడుతూ “నేను ఎవరినీ ప్రేమించడం లేదు. కెరీర్ మీదే నా దృష్టంతా. అన్ని భాషల్లో నటించాలి, పేరు తెచ్చుకోవాలి.. ఇదే నా లక్ష్యం”అని పేర్కొంది.
- Advertisement -