- Advertisement -
లక్నో : ఐపిఎల్‌లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోను ఆదుకున్నాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన రాహుల్ 8 ఫోర్లు, సిక్స్‌తో 74 పరుగులు చేశాడు. ఓపెనర్ మేయర్స్ (29), కృనాల్ (18), స్టోయినిస్ (15) పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సికందర్ రజా (57), మాథ్యూ షార్ట్ (34), షారుక్ ఖాన్ 23 (నాటౌట్) పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read: ముంబైకి సవాల్…. నేడు కోల్‌కతాతో కీలక పోరు
- Advertisement -