ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజన తండాల్లో అభివృద్ధి నగరా మోగిందని ఐటి పుర పాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్ట్టం చేశారు. సమస్యల వలయంలో గిరి గీసుకున్న తండాలు, గ్రామాలు సిఎం కెసిఅర్ పకడ్బందీగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ప్రణాళికల ద్వారా నేడు రూపు రేఖలు మారి పోయాయని తెలిపారు. ఆయన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల, రాజన్నపేట, బాకూర్‌పల్లి , తిమ్మాపూర్ తండాల్లో సుడిగాలి పర్యటన చేసి టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతితో కలసి నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డప్పుల చప్పుల్లు , నృత్యా ప్రదర్శనలు చేసి మంత్రి కెటిఆర్‌కు అపూర్వ స్వాగతం పలికారు.
అయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభావేధికలపై మంత్రి నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్రంలో 3416 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరించినట్లు తెలిపారు. 3100 మందిని వార్డు మెంబర్లు, ఎంపిటిసిలుగా ఎన్నుకొని సముచిత స్థానం కల్పించినట్లు పేర్కోన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25 తండాలను జి పిలుగా ఏర్పాటు చేసి 80 శాతం భవన నిర్మాణాలు పూర్తి చేసినట్లు వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సిఎం కెసిఆర్ ఇంటింటికి మిషన్‌భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. బాకూర్‌పల్లి తండాలో ఈ పథకం వాడుకలో లేదని తెలుసుకున్న మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ద్వారా కారణాలు తెలుసుకొని 24 గంటల్లో ట్యాంక్‌ను శుద్ధి చేసి నల్లా కనెక్షన్లు ఇవ్వాలని ఆర్‌డబూఎ్లస్ డిఇ , ఏఇలను ఆదేశించారు. బోరు బావుల నీరు తాగడం వలన ఫ్లోరైడ్ సమస్య ఏర్పడి ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు.
Also Read: తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుల పంట
స్వపరిపాలనకు దూరంగా ఉన్న బాకూర్‌పల్లికి తిమ్మాపూర్ నుంచి దేవుని గుట్ట తండా వరకు తార్ రోడ్డు వేసి రవాణా సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఉద్యమ కాలంలో కనీస మౌలిక వసతులు లేని గిరిజన గ్రామాలకు డ్రైనేజీ వ్యవస్థ , అంతర్గత రోడ్లు , పాఠశాల భవనాలు, స్మ శాన వాటికలు, కంపోస్ట్ ఎరువుల షెడ్లు , పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చి దిద్దినట్లు తెలిపారు. గడచిన ఎనిమిదేండ్ల పాలనలో ఒక్కోక్క గ్రామ ప్రగతి ని వేదికను పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సర్పంచ్‌లు ఇంత వరకు చేసిన అభివృద్ధ్ది పనులు, ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్లెక్సి బోర్డుల ద్వారా గ్రామ కూడలిలో ప్రదర్శించాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలో రెండు ఎకరాల స్థలంలో గిరిజన సామూహిక భవనం నిర్మించగలమని తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా పునాది రాయి వేయగలమని హర్ష ధ్వనుల మధ్య ప్రకటించారు.
పోడు భూముల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి రెవిన్యూ అధికారులు లబ్ధి దారుల ఇంటికి వెల్లి పట్టాలు పంపిణీ చేయగలరని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు గృహ లోక్ష్మి పథకం ద్వారా రూ, 3 లక్షలు చెల్లించి ఇండ్లు నిర్మించగలమని తెలిపారు. తాను దత్తత తీసుకున్న రాజన్నపేటను అభివృద్ధ్దిలో పరుగులు పెట్టించినట్లు తెలిపారు. గ్రామ ప్రగతికి రూ. 20 కోట్ల 38 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. త్వరలో 90 మంది మహిలలకు కుట్టు మిషన్లు అంద చేయగలమన్నారు. అంతకు ముందు దుమాలలో యాదవులు నిర్వహించిన బీరప్ప కల్యాణ ఉత్సవాలకు హాజరై పూజారుల ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ కారుడు మాజీ ఏఎంసి చైర్మన్ అందె సుబాస్‌ను తిమ్మాపూర్‌లోని తన స్వగృహానాకి వెల్లి పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సత్యపాల్ ఆర్డీఓ శ్రీనివాస్‌రావు , తహసీల్దార్ జయంత్ కుమార్, ఎంపిడిఓ చిరంజీవి, మండల ఏఓ భూమ్‌రెడ్డి , సర్పంచ్‌లు ముక్క శంకర్ , వివిధ కుల సంఘాల నేతలు కార్యకర్తలు , పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు వీర్నపల్లి, ఎంపిపి, జడ్పీటిసి, సెస్ డైరెక్టర్‌తో పాటు గిరిజన సంఘాల నాయకులు పాల్గోన్నారు.