Monday, December 23, 2024

పాడే మోసిన ఎంఎల్ఎ రఘునందన్ రావు..

- Advertisement -
- Advertisement -

రోచేగుంట: రోడ్డు ప్రమాదంలో బిజెపి నాయకుడు మృతి చెందిన సంఘటన చేగుంట మం డలం పొలంపల్లి గ్రామ శివారులో మెదక్ రోడ్డు పై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పొలంపల్లి గ్రామానికి చెందిన ర్యాపాకుల సతీష్ గౌడ్(24) చిన్నశంకరంపేట మండల కేంద్రం నుండి నుండి తన గ్రామానికి పొలంపల్లి బైక్ పై వస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనగా సతీష్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎరియా అసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో సతీష్‌గౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎంఎల్ఎ రఘునందన్‌రావు సోమవారం  పొలంపల్లి గ్రామానికి వెళ్లి సతీస్‌గౌడ్ కుటుంబ సభ్యులను ఒదార్చారు. అనంతరం సతీష్‌గౌడ్ శవంపై బీజేపీ జండా ను కప్పి నివాళులు అర్పించారు. సతీష్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొని అంతిమ యాత్రలో పాడేను మోసారు. బాధిత కుటుంబానికి బిజెపి పార్టీ ,తాను అండగా ఉంటామని తెలిపారు. ఈ అంతిమ యాత్రలో చేగుంట,నార్సింగి మండలా ల బీజేపీ నాయకులు, జిల్లా నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News