Monday, December 23, 2024

తెలంగాణకు 13 జాతీయ పురస్కారాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుల్లో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ – 2023లో తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డులను అందజేసింది. ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు అందుకున్నారు. జాతీయ అవార్డులతో పాటు ప్రత్యేకంగా నగదు పురస్కారాలను ఉత్తమ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు – 2023లో తెలంగాణకు చెందిన 4 గ్రామాలు వివిధ విభాగాల్లో నెంబర్ వన్ గా నిలిచాయి. అందులో -ఆరోగ్య పంచాయతీ విభాగంలో గౌతంపూర్ (భద్రాద్రి కొత్త గూడెం ), -సమృద్ధిగా మంచినీరు అందుబాటులో ఉన్న విభాగంలో నెల్లుట్ల ( జనగామ), -సామాజిక భద్రత విభాగంలో కొంగట్‌పల్లి (మహబూబ్ నగర్), -స్నేహ పూర్వక మహిళా గ్రామాల విభాగంలో అయిపూర్ (సూర్యాపేట), -పేదరిక నిర్మూలన, జీవనోపాధులు విభాగంలో మందొండి (గద్వాల), -సుపరిపాలన గ్రామ పంచాయతీల విభాగంలో చీమల్‌దారి ( వికారాబాద్), -క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో సుల్లాన్‌పూర్ (పెద్దపలి), -స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాల విభాగంలో గంభీర్‌రావుపేట (రాజన్న సిరిసిల్ల) ఉన్నాయి.
నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ – 2023లో ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీల అవార్డు విభాగంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి, ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో ములుగు జిల్లా, స్పెషల్ కేటగిరీ అవార్డుల్లో… గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామం, కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్ విభాగంలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం, నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ – సర్టిఫికేట్ల విభాగం – గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ కు సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలంలోని ఎర్రవెల్లి ఎంపికైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News