Monday, November 25, 2024

మరో మూడు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకూ వున్న ఎండల స్థానంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. సుల్తాన్ బజార్, కోఠి అబిడ్స్ , నాంపల్లి , నారాయణగూడ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసింది.

రాష్ట్రంలో యాచారంలో 6మి.మి వర్షం కురిసింది. మిడ్జిల్‌లో 2.6, వికారాబాద్‌లో 2మి.మి వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి జల్లులు పడ్డాయి. మహారాష్ట్ర నుండి ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక , దక్షిణ తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 0.9కి.మి ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజలు తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. రానున్న 48గంటల్లో పగటి ఉష్ణోగ్రతలు 41డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 43డిగ్రీల మధ్యన నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని , హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం పాల్వంచలో అత్యధికంగా 45డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఖమ్మంలో 43డిగ్రీలు రికార్డయింది. అదిలాబాద్‌లో 42.5, భద్రాచలంలో 41.8,హన్మకొండలో 41, హైదరాబాద్‌లో 38.7, మహబూబ్ నగర్‌లో 40.8, మెదక్‌లో 40, నల్లగొండలో 40.5, నిజామాబాద్‌లో 41.5, రామగుండంలో 41డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News