న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి భవన్ కార్యకలాపాలను కేంద్రంలోని బిజెపి సర్కారు నిర్దేశిస్తోందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వాలంటే ముందుగాప్రధాని నరేంద్రమోడీ క్లియరెన్స్ ఉండాలని తీవ్ర ఆరోపణ చేశారు. దీనికి ఉదాహరణగా తను ఎదుర్కొన్న ఉదంతాన్ని మాలిక్ వెల్లడించారు. గతంలో తను గవర్నర్‌గా ఉన్న సమయంలో రాష్ట్రపతితో అపాయింట్‌మెంట్ ఉండటంతో ద్రౌపది ముర్మును కలిసేందుకు బయలుదేరానని, దారిలో ఉండగానే రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. కీలక విషయాలు కారణంగా అపాయింట్‌మెంట్ రద్దు చేసినట్లు తెలిపారన్నారు.
Also Read: దారుణ ఘటన.. పట్టపగలే కాలేజీ విద్యార్థిని కాల్చివేత..
అనంతరం రాష్ట్రపతి భవన్ వర్గాలు తనకు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ జాబితాప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ)కి వెళుతోందని, పిఎంఒ కార్యాలయం నుంచి రాష్ట్రపతి ఎవరిని కలవాలనేదానిపై ఆదేశాలు అందుతాయని అధికారవర్గాలు తెలిపినట్లు మాలిక్ వెల్లడించారు. ఈ మేరకు మీడియా సంస్థ ‘ది వైర్’కు సత్యపాల్ మాలిక్ ఇచ్చిన ఇంటర్వూ శుక్రవారం పబ్లిష్ అయింది. జర్నలిస్ట్ కరణ్‌థాపర్ మాలిక్‌ను ప్రశ్నిస్తూ మీరు మాట్లాడుతోంది రాష్ట్రపతి ముర్ము గురించేనా అని అడగగా మాలిక్ అవునని స్పష్టం చేశారు. ఆమె కలవాలనుకున్నా స్వయంగా ఎవరితో సమావేశం కాలేరని మాలిక్ పునరుద్ఘాటించారు.
అయితే రాష్ట్రపతి ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మ? అని ప్రశ్నించగా అయిఉండొచ్చని మాలిక్ బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాల మేరకే ద్రౌపది ముర్ము పనిచేస్తారని మాలిక్ ఆరోపించారు. ఇది దేశ అత్యున్నత వ్యక్తిని అవమానించడమే అని థాపర్ వ్యాఖ్యానించగా కాదని మాలిక్ వ్యంగ్యంగా బదులిచ్చారు. కాగా సెక్రటేరియట్ రూపొందించిన ప్రాధాన్యత జాబితాలో రాష్రపతి హోదాపరంగా అగ్రస్థానంలో ఉంటారు. రెండోస్థానంలో ఉప రాష్ట్రపతి ఉండగా జాబితాలో ప్రధానమంత్రి మూడోస్థానంలో ఉంటారు. ఈ క్రమంలో రాష్ట్రాల గవర్నర్లు నాలుగో స్థానంలో ఉంటారు. ఈ జాబితాలను చివరిసారిగా సవరించారు. ఆ తర్వాత ఎటువంటి మార్పు చేయలేదు. కాగా మాలిక్ గతంలో నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు. బీహార్, ఒడిశా, కశ్మీర్, మేఘాలయ రాష్ట్రాలకు 201722మధ్య గవర్నర్‌గా వ్యవహరించారు. 198091 మధ్య కాలంలో నుంచి పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్రపతి ఆహ్వానితుల జాబితాను పిఎంఒ క్లియర్ చేస్తోందని మాలిక్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు.