Monday, December 23, 2024

వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ కడుపులో బ్యాండేజ్ వదిలేసి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్థిక స్థోమత లేని పేద ప్రజలు వైద్యానికి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతుంటారు. కానీ కొంత మంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాసుపత్రి అంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం మహిళ కడుపులో బ్యాండేజ్ ని వదిలేసి కుట్లువేశారు.

దీంతో మహిళ తీవ్ర కడుపునొప్పితో బాదపడుతోంది. 16 నెలల నుంచి నరకయాతన అనుభవిస్తుంది. ఈ క్రమంలో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెల్లి పరీక్ష చేయించుకుంది. అక్కడి వైద్యులు స్కానింగ్ తీసారు. స్కానింగ్ లో కడుపులో బ్యాండేజ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. వెంటనే మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బ్యాండేజ్ ని బయటకు తీశారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులపట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించకుండా సరైన వైద్యం అందించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News