- Advertisement -
అమరావతి: చిత్తూరు జిల్లాలోని కొండమిట్టలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు యువతి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. యువతిని చంపి అనంతరం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి ప్రేమ వ్యవహారణమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
- Advertisement -