- Advertisement -
హైదరాబాద్: ‘క్యూ న్యూస్’ యూట్యూబ్ ఛానెల్ యజమాని తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ చింతపండుకు మంగళవారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. మల్లన్నతోపాటు ‘క్యూ న్యూస్’ టీమ్ మెంబర్స్ సుదర్శన్ గౌడ్, మరోకరు జైలు నుంచి విడుదలయ్యారు. టెక్నికల్ ఇష్యూ కారణంగా మరో ఇద్దరు రేపు విడుదల కానున్నారు.
కాగా, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను బలవంతంగా అపహరించిన ఆరోపణపై మార్చి 22న సాయంత్రం మల్లన్నతోపాటు మరో నలుగురిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సోమవారం మల్కాజిగిరిలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మల్లన్నకు బెయిల్ మంజూరు చేసింది.
- Advertisement -